Mrunal Thakur: 'కుర్చీ మడతపెట్టి' పాటకి అదిరిపోయే స్టెప్పులు వేసిన మృణాల్

by Prasanna |
Mrunal Thakur: కుర్చీ మడతపెట్టి పాటకి అదిరిపోయే స్టెప్పులు వేసిన  మృణాల్
X

దిశ, వెబ్ డెస్క్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీ లీల హీరోయిన్ గా మన ముందుకొచ్చిన చిత్రం 'గుంటూరు కారం'. ఈ మూవీ బ్లాక్ బస్టర్ రేంజ్లో హిట్ అవ్వకపోయినా సాంగ్స్ మాత్రం విడుదలకు ముందే సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా, తమన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయింది.

ఈ సినిమా మొత్తం ఒక వైపు అయితే, 'కుర్చీ మడత పెట్టి' అనే పాట ఒక వైపు నిలిచింది. ఈ ఒక్క సాంగ్ ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పించింది. ఇక యూట్యూబ్ లో కూడా బాగా వైరల్ అయింది. ఇప్పటికీ ఈ పాట ఫంక్షన్స్ , పార్టీస్ లో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా, ఓ ఈవెంట్ లో ఈ పాట‌కు 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ మాస్ స్టెప్పులు వేసింది.

ఇటీవలే ఓ వేడుకకు గెస్ట్ గా హాజ‌రైన మృణాల్ ఠాకూర్ ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. కాగా, ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. దీన్ని చూసిన ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ మహేష్ బాబు పక్కన మీరు ఉంటె జోడి అదిరిపోయేదంటూ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

For video : https://x.com/Niteesh__09/status/1837765593337860205

Next Story

Most Viewed