ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్

by Harish |
ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. గతేడాది డిసెంబర్‌లో గాయపడిన ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌‌ నాటికి సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు. గత నెలలో సర్జరీ చేయించుకున్న అతను తాజాగా రిహాబిలిటేషన్ ప్రారంభించాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబై ఇండియన్స్ జట్టులో సూర్య ఎంత కీలక ఆటగాడో ప్రత్యేకంగా చెప్పకనక్కర్లేదు. గాయం కారణంగా అతను ఐపీఎల్‌కు దూరమవుతాడని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుండటంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

గతేడాది డిసెంబర్‌లో సౌతాఫ్రికా పర్యటనలో సూర్యకుమార్ స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడ్డాడు. టీ20 సిరీస్ తర్వాత అతను తిరిగి స్వదేశానికి వచ్చాడు. గాయం కారణంగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌తోపాటు ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు అతను దూరమయ్యాడు. దాదాపు గాయం నుంచి కోలుకునేందుకు 3 నుంచి 4 నెలలు సమయం పట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో అతను ఐపీఎల్‌ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, గత నెలలో జర్మనీలో సూర్య సర్జరీ చేయించుకున్నాడు. తాజాగా అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. రిహాబిలిటేషన్ కూడా మొదలుపెట్టాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతోపాటు ఫిట్‌నెస్ సాధించడంపై ఫోకస్ పెట్టాడు. ఐపీఎల్‌తోపాటు టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు.

Advertisement

Next Story