న్యాయ పోరాటానికి దిగిన వినేశ్.. కోర్టు‌లో అప్పీలు..ఆమె డిమాండ్ ఏంటంటే?

by Harish |
న్యాయ పోరాటానికి దిగిన వినేశ్.. కోర్టు‌లో అప్పీలు..ఆమె డిమాండ్ ఏంటంటే?
X

దిశ, స్పోర్ట్స్ : తనపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా వినేశ్ ఫొగట్ న్యాయపోరాటానికి దిగింది. న్యాయం చేయాలని వినేశ్ బుధవారం కోర్టును ఆశ్రయించింది. క్రీడా వివాదాలను పరిష్కరించే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(సీఏఎస్)‌లో ఆమె అప్పీలు చేసింది. అత్యవసర విచారణకు వినేశ్ అభ్యర్థించింది. తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలని కోరింది. దీనిపై సీఏఎస్ గురువారం తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. కాగా, క్రీడలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి 1983లో సీఏఎస్‌ను స్థాపించారు. ఇది స్వతంత్ర సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్‌లో ఉంది. అయితే, ఒలింపిక్స్ నేపథ్యంలో పారిస్‌లో తాత్కాలికంగా కోర్టులను ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed