West Indies vs India 1st Test day 2: అదరగొడుతున్న భారత ఓపెనర్లు.. తొలి సెషన్‌లో విండీస్‌కి దక్కని వికెట్..

by Vinod kumar |
West Indies vs India 1st Test day 2: అదరగొడుతున్న భారత ఓపెనర్లు.. తొలి సెషన్‌లో విండీస్‌కి దక్కని వికెట్..
X

దిశ, వెబ్‌డెస్క్: డొమినికా టెస్టులో టీమిండియా ఆధిక్యం కొనసాగుతోంది. వెస్టిండీస్‌ని 150 పరుగులకి ఆలౌట్ చేసిన భారత జట్టు, రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 146 పరుగులు చేసింది. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 4 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది భారత జట్టు. ఓవర్‌నైట్ స్కోరు 80/0 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, రెండో రోజు తొలి సెషన్‌లో 32 ఓవర్లలో 66 పరుగులు జోడించారు.

104 బంతుల్లో 7 ఫోర్లతో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న యశస్వి జైస్వాల్, 167 బంతుల్లో 62 పరుగులు చేయగా.. 163 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసిన రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. ఆరంగ్రేటం టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన రెండో భారత లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2013లో ఆస్ట్రేలియాపై టెస్టు ఆరంగ్రేటం చేసిన శిఖర్ ధావన్.. ఆరంగ్రేటం టెస్టులో 187 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.

Advertisement

Next Story

Most Viewed