West Indies vs India 1st T20I: టీమిండియాతో తొలి టీ20.. టాస్ గెలిచిన విండీస్

by Vinod kumar |   ( Updated:2023-08-07 09:09:44.0  )
West Indies vs India 1st T20I: టీమిండియాతో తొలి టీ20.. టాస్ గెలిచిన విండీస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్‌ వేదికగా టీమిండియా vs విండీస్‌ మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున తిలక్ వర్మ, ముకేశ్ కుమార్ అరంగేట్రం చేయనున్నారు. స్వదేశంలో టీమిండియాతో టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోయిన వెస్టిండీస్‌ మరో కీలకపోరుకు సిద్దమైంది. కనీసం టీ20 సిరీస్‌లోనైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలనే పట్టుదలతో విండీస్‌ బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకు టీమ్ఇండియా-వెస్టిండీస్‌ జట్ల మధ్య 25 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత జట్టు 17 మ్యాచుల్లో గెలవగా.. 7 మ్యాచుల్లో ఓడింది. ఒక మ్యాచ్‌లో రిజల్ట్​ రాలేదు. వెస్టిండీస్​ గడ్డపైనా టీమ్​ఇండియాదే ఆధిక్యం. అక్కడ 4 మ్యాచుల్లో భారత జట్టు విజయాన్ని అందుకోగా.. ప్రత్యర్థి జట్టు కేవలం రెండిటిలోనే గెలిచింది.

తటస్థ వేదికల్లో 5 మ్యాచుల్లో భారత్‌ విజయాన్ని సాధించగా.. విండీస్​ రెండు మ్యాచుల్లోనే గెలుపొందింది. ఎక్కువ-తక్కువ రెండూ విండీస్​దే.. గత ఆరు టీ20ల్లో టీమ్​ఇండియా ఐదింటిలో గెలుపొందింది. ఒక్క మ్యాచులో మాత్రం ఓటమిని అందుకుంది. అయితే ఒక మ్యాచ్‌లో మాత్రం విండీస్​భారీ స్కోరు చేసింది. 2016లో టీమ్​ఇండియాపై వెస్టిండీస్​జట్టు 245/6 స్కోరు చేయడం గమనార్హం. అలానే అత్యల్ప స్కోరు కూడా వెస్టిండీస్​పేరు మీదనే ఉంది. 2019లో జరిగిన ఓ మ్యాచ్‌లో మాత్రం 95 పరుగులకే ఆలౌట్ అయింది. మూడో వన్డే జరిగిన ట్రినిడాడ్‌లోని బ్రియాన్‌ లారా స్టేడియంలోనే మొదటి టీ20 మ్యాచ్‌ కూడా జరగనుంది. ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండొచ్చు. చివరి వన్డేలో భారత్‌ ఏకంగా 351 పరుగులు చేసింది. ఇకపోతే ఈ మ్యాచ్​సమయంలో చిన్నపాటి వర్షం పడే అవకాశం ఉంది.

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI):

కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (సి), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్

భారత్ (ప్లేయింగ్ XI):

శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్

Advertisement

Next Story