- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vedanta: ఒడిశాలో వేదాంత భారీ పెట్టుబడులు.. రెండు లక్షల మందికి జాబ్స్..!
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ మైనింగ్ కంపెనీ(Mining Company) వేదాంత(Vedanta) దేశంలో రాబోయే రోజుల్లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది. ఒడిశా(Odisha)లో 6 మిలియన్ టన్నుల అల్యూమినా రిఫైనరీ(Alumina Refinery), 3 మిలియన్ టన్నుల గ్రీన్ అల్యూమినియం(Green Aluminum) ప్లాంట్లను స్థాపించనుంది. ఈ మేరకు వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్(Vedanta Chairman Anil Agarwal) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త పెట్టుబడుల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు(Employment opportunities) లభిస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఒడిశాలో లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టామని, ఇవి అదనమని ఆయన వెల్లడించారు. ఈ పెట్టుబడులతో 2030 నాటికీ ఒడిశా 500 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఒడిశా ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్లే స్కూళ్ళు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నెలకొల్పుతామన్నారు. అయితే త్వరలోనే ఈ పెట్టుబడుల గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.