టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక వైఫల్యం.. సంచలన నిర్ణయం తీసుకున్న కెప్టెన్

by Harish |
టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక వైఫల్యం.. సంచలన నిర్ణయం తీసుకున్న కెప్టెన్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పర్యటనకు ముందు శ్రీలంక టీ20 కెప్టెన్ వానిందు హసరంగ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 కెప్టెన్‌గా తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. కెప్టెన్‌గా తప్పుకుని జట్టులో ఆటగాడిగా కొనసాగాలనే తన నిర్ణయం జట్టుకు మేలు చేస్తుందని హసరంగ పేర్కొన్నాడు. ఆటగాడిగా శ్రీలంక తరపున ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని, జట్టు నాయకత్వానికి తన మద్దతు ఉంటుందని తెలిపాడు.

హసరంగ రాజీనామాను శ్రీలంక క్రికెట్ బోర్డు ఆమోదించింది. అంతర్జాతీయ క్రికెట్ ప్రణాళికల్లో అతను ముఖ్యమైన ఆటగాడిగా కొనసాగుతాడని పేర్కొంది.కెప్టెన్‌గా తప్పుకోవడానికి హసరంగ కారణం వెల్లడించలేదు. అయితే, టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక వైఫల్యానికి బాధ్యత వహిస్తూ అతను సారథిగా తప్పుకున్నట్టు తెలుస్తోంది. కెప్టెన్సీ చేపట్టిన ఆరు నెలల్లోనే అతను ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతేడాది డిసెంబర్‌లో హసరంగ టీ20 కెప్టెన్‌గా నియామకమయ్యాడు. అతని నాయకత్వంలో శ్రీలంక జట్టు 10 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. ఆరింట విజయం సాధించింది.

Advertisement

Next Story

Most Viewed