ఐపీఎల్‌లో పనిచేస్తా.. కానీ, టీమిండియా కోచ్‌గా ఉండను : వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు

by Harish |
ఐపీఎల్‌లో పనిచేస్తా.. కానీ, టీమిండియా కోచ్‌గా ఉండను : వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వైదొలిగిన తర్వాత గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, హెడ్ కోచ్‌ పదవిపై పలువరు భారత మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపించలేదని వార్తలు వస్తున్నాయి. అందులో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు కూడా ఉంది. తాజాగా భారత జట్టు ప్రధాన కోచ్ పదవిపై సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండనని తెలిపిన వీరూ.. అందుకు కారణాలను వివరించాడు.‘నేను భారత ప్రధాన కోచ్‌గా మారితే 15 ఏళ్లపాటు ఏం చేశానో అదే చేయాలి. భారత జట్టు అవసరాల దృష్యా ఏడాదిలో 8-9 నెలలు జట్టుతోనే ఉండాలి. నాకు ఇద్దరు పిల్లలు. ఒకరికి 14 ఏళ్లు, మరొకరి 16 ఏళ్లు. ఇద్దరూ ఢిల్లీకి ఆడుతున్నారు. ఒకరు ఓపెనింగ్ బ్యాటర్. మరొకరు ఆఫ్ స్పిన్నర్. వారితో నేను సమయం గడపాలి. క్రికెట్‌లో వారికి సహాయం చేయాలి. హెడ్ కోచ్‌గా మారితే వారికి దూరమవ్వాల్సి ఉంటుంది. అది నాకు అతిపెద్ద సవాల్.’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అయితే, ఐపీఎల్‌లో మాత్రం కోచ్‌గా, మెంటార్‌గా అవకాశం వస్తే వదులుకోనని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed