విరాట్‌లో కసి తగ్గింది : ఆసీస్ మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌

by saikumar |
విరాట్‌లో కసి తగ్గింది : ఆసీస్ మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌
X

దిశ,స్పోర్ట్స్ : టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రన్ మెషిన్ విరాట్‌ కోహ్లిపై ఆసీస్ మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లిలో మునుపటిలాగా పరుగుల కసి తగ్గిందని, ఊపు కనిపించడం లేదని హాగ్‌ ఆరోపించాడు. గత కొంతకాలంగా విరాట్‌ టెస్టుల్లో అంత గొప్ప ప్రదర్శన ఏమీ చేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఇలాగే ఆడితే విరాట్‌ కోహ్లీ సచిన్‌ గత రికార్డులు అధిగమించడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 200 టెస్ట్‌లు ఆడి 15,921 పరుగులు చేయగా.. 35 ఏళ్ల విరాట్‌ ఇప్పటివరకు 114 టెస్ట్‌లు ఆడి 8,871 పరుగులు మాత్రమే సాధించాడు. విరాట్‌ సచిన్‌ రికార్డును అధిగమించాలంటే మరో 7,051 పరుగులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఫామ్‌తో కోహ్లి ఇన్ని పరుగులు సాధించడం దాదాపుగా అసాధ్యమే అని హాగ్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story