- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైపూర్‌లో కోహ్లీ విగ్రహం.. ఎందుకో తెలుసా?
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వారసత్వ దినోత్సవం(ఏప్రిల్ 18) సందర్భంగా జైపూర్‌లోని వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. గత కొంతకాలంగా మ్యూజియాన్ని సందర్శిస్తున్నవారి నుంచి విరాట్ కోహ్లీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ వచ్చిందని మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్ శ్రీవాస్తవ వెల్లడించారు. ముఖ్యంగా యువత, పిల్లల నుంచి ఈ డిమాండ్ ఎక్కువగా వచ్చిందని తెలిపారు. అందుకు అనుగుణంగానే కోహ్లీ మైనపు విగ్రహాన్ని గురువారం మ్యూజియంలో ఏర్పాటు చేశామని చెప్పారు. 35 కేజీల బరువున్న ఈ విగ్రహాన్ని తయారుచేసేందుకు 2 నెలల సమయం పట్టిందని వివరించారు. నహర్‌గఢ్ ఫోర్ట్ సమీపంలో ఉన్న ఈ మ్యూజియంలో ఇప్పటికే 44 మంది ప్రముఖుల మైనపు విగ్రహాలు ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు. క్రికెటర్లలో సచిన్, మహేంద్ర సింగ్ ధోనీల విగ్రహాలు ఉండగా, వీరితోపాటు మహాత్మా గాంధీ, నెహ్రూ, అబ్దుల్ కలాం, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, కల్పనా చావ్లా, అమితాబ్ బచ్చన్, మథర్ థెరిస్సాల విగ్రహాలు సైతం ఉన్నాయని వివరించారు.