- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘అతడో గ్రేట్ ప్లేయర్’.. సునీల్ ఛైత్రిపై విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం..!
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ సునీల్ ఛైత్రి ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 19 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఛైత్రి.. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో భాగంగా జూన్ 6న కువైట్‌తో మ్యాచ్ తనకు చివరిదని అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలో సునీల్ ఛైత్రి రిటైర్మెంట్‌పై టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించారు. ఆర్సీబీ ఇన్ సైడర్ షోలో విరాట్ మాట్లాడుతూ.. రిటైర్మెంట్ అనౌన్స్ చేసే ముందు ఛైత్రి తనకు మేసేజ్ చేశాడని తెలిపారు.
ఆటకు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా లైఫ్ అంతా హ్యాపీగా సాగాలని రిప్లై ఇచ్చానని చెప్పాడు. సునీల్ ఛైత్రి ఓ గ్రేట్ ప్లేయర్ అని ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కొనియాడాడు. కాగా, రంగాలు వేరు అయిన కోహ్లీ, సునీల్ ఛైత్రి మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి పలు ఈవెంట్లలో పాల్గొనడం, సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటు అభిమానుల్లో జోష్ నింపుతు ఉంటారు. దీంతో వీరిద్దరి మధ్య మాంచి బాండింగ్ ఏర్పడింది. ఈ సాన్నిహిత్యంతోనే కోహ్లీ ఛైత్రిపై పొగడ్తలు కురిపించారు.