గ్రేటెస్ట్ టెస్ట్ కెప్టెన్ WTC ఫైనల్‌ను గెలవలేదు.. కోహ్లీ ఫొటోతో కన్నీరు

by Mahesh |   ( Updated:2023-06-16 14:46:39.0  )
గ్రేటెస్ట్ టెస్ట్ కెప్టెన్ WTC ఫైనల్‌ను గెలవలేదు.. కోహ్లీ ఫొటోతో కన్నీరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ లోని ఓవల్‌ గ్రౌండ్‌లో ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ WTC కప్‌ను దాటి వెళ్తున్న ఫోటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో కోహ్లీ చాలా బాధతో నడుస్తూ వెళుతున్నట్లు కనిపించింది. దీంతో కోహ్లీ అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అందులో ఓ అభిమాని అత్యంత బాధాకరమైన చిత్రం' అని ట్వీట్ చేయగా.. అతను తన ఆశయాన్ని ఎప్పటికీ వదులుకోకు అని రాసుకొచ్చాడు. అలాగే.. మరో అభిమాని.. "గ్రేటెస్ట్ టెస్ట్ కెప్టెన్ WTC ఫైనల్‌ను గెలవలేదు" అని రాశాడు. కాగా ఈ WTC ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

Advertisement

Next Story