Vinod Kambli : ఆస్పత్రి నుంచి వినోద్ కాంబ్లీ డిశ్చార్జ్.. వైద్యులు ఏమన్నారంటే..?

by Sathputhe Rajesh |
Vinod Kambli : ఆస్పత్రి నుంచి వినోద్ కాంబ్లీ డిశ్చార్జ్.. వైద్యులు ఏమన్నారంటే..?
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండు వారాల క్రితం కాంబ్లీ యూరినరీ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్యులు కాంబ్లీ మెదడులో గడ్డ కట్టినట్లు గుర్తించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న సందర్భంగా కాంబ్లీ అక్కడున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అల్కహాల్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించాడు. కాంబ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని వైద్యం అందించిన డాక్టర్ వివేక్ త్రివేది తెలిపారు. కొన్ని జాగ్రత్తలు పాటించాలని కాంబ్లీకి సూచించారు. కఠిన సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ఫ్రెండ్స్, వెల్ విషర్స్‌కు కాంబ్లీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. తాను క్రికెట్‌ను వదులుకోవడానికి ఇప్పటికీ సిద్ధంగా లేనని ఈ సందర్భంగా కాంబ్లీ అన్నాడు.

Advertisement

Next Story