Highest Salary : అత్యధిక వేతనం భారతీయుడిదేనా...రోజుకు 48కోట్లు !

by Y. Venkata Narasimha Reddy |
Highest Salary : అత్యధిక వేతనం భారతీయుడిదేనా...రోజుకు 48కోట్లు !
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఐటీ విప్లవం ఉద్యోగుల జీతాల్లోనూ మార్పులు తెచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు అధికమన్న భ్రమలను చెరిపేసి గ్లోబలైషన్ మార్కెట్ వేల జీతాలను, లక్షల స్థాయికి తీసుకెళ్లింది. కొన్ని సాంకేతిక సంస్థల సీఈవోలకు వేతనాలు కోట్లల్లో కూడా ఉంటున్నాయి. అయితే క్వాంటం స్కేప్(Quantumscape)అనే సంస్థకు సీఈఓ(CEO)గా బాధ్యతలు నిర్వర్తించిన ఇండియాకు చెందిన జగదీప్ సింగ్(Jagdeep Singh)మాత్రం ప్రపంచంలోనే అధిక వేతనం(Highest salary in the world)పొందుతున్నట్లుగా సోషల్ మీడియా కథనం సంచలనంగా మారింది. జగదీప్ సింగ్ ఏకంగా ఏడాది(Per Year)కి రూ. 17 వేల 500 కోట్లు జీతం అంటే రోజుకు రూ. 48 కోట్లు(48 Crores Per Day) అందుకుంటున్నాడు. జగదీప్.. గూగుల్, మైక్రోసాఫ్ట్, స్పేస్ ఎక్స్ లాంటి సీఈవోలు కూడా పొందలేనంత వేతనాన్ని పొందుతున్నారు. అంటే ఓ భారతీయుడే ప్రపంచంలో అత్యధిక వేతనం పొందడం ఈ దేశ ప్రజలకు గర్వకారణని మనవాళ్లు సంబరపడుతున్నారు.

అన్టాప్ సంస్థ నివేదిక ప్రకారం, జగదీప్ సింగ్ అనేక కంపెనీల్లో కీలక పదవులు నిర్వహించిన అనుభవంతో క్వాంటమ్ స్కేప్ సంస్థను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారని కథనం. జగదీప్ సింగ్ సాంకేతిక రంగంలో అనేక పరిశోధనలు చేసి.. తమ సంస్థను విజయం వైపు నడిపించారని.. లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో క్వాంటం స్కేప్ పురోగతి సాధించటంలో, విప్లవాత్మక మార్పులు తీసుకురావటంలో జగదీప్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఆ పరిజ్ఞానంతోనే 2010లో క్వాంటం స్కేప్‌ను స్థాపించారు. ఈ కంపెనీ రేపటితరం బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్నది. ఈ బ్యాటరీలలో ఇంధన సామర్థ్యం, తక్కువ సమయంలో చార్జింగ్‌ అనే ప్రత్యేకతలు పలు అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలను ఆకర్షించాయి. ఫోక్స్‌వాగన్‌, బిల్‌గేట్స్‌ వంటి దిగ్గజాలు క్వాంటం స్కేప్‌లో పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది ఫిబ్రవరి 16న సీఈవోగా రాజీనామా చేసిన జగ్దీప్‌ సింగ్‌ ఆ బాధ్యతలను శివశివరాంకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన భారీ వేతనంతో పనిచేస్తున్నట్లుగా సోషల్ మీడియా కథనాలు వైరల్ గా మారాయి.

Advertisement

Next Story