- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం..
న్యూఢిల్లీ : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్) ప్రెసిడెంట్‌గా అతని సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికవడంపై రెజ్లర్ల నుంచి నిరసన గళం పెరుగుతోంది. ఇప్పటికే రియో ఒలింపిక్స్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. బజరంగ్ పూనియా, వీరేందర్ సింగ్ ‘పద్మశ్రీ’ అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. తాజాగా మరో స్టార్ రెజ్లర్, వరల్డ్ చాంపియన్‌షిప్ మెడలిస్ట్ వినేశ్ ఫొగట్ దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సుదీర్ఘ లేఖ రాసింది. ‘సాక్షి మాలిక్ రెజ్లింగ్‌ను వదిలేసింది. బజరంగ్ పూనియా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేశాడు. ఒలింపిక్ పతకాలు సాధించిన వీరు అలాంటి చర్య ఎందుకు తీసుకున్నారో దేశం మొత్తం తెలుసు. దేశ నాయకుడిగా మీకు కూడా తెలియాలనే లేఖ రాస్తున్నా. 2016లో సాక్షి మాలిక్ ఒలింపిక్ మెడల్ సాధించినప్పుడు మీ ప్రభుత్వం ఆమెను ‘బేటి బచావో.. బేటి పడావో’ క్యాంపెయిన్‌కు అంబాసిడర్‌గా నియమించింది. అప్పుడు దేశంలోని మహిళా అథ్లెట్లందరూ శుభాకాంక్షలు తెలుపుకున్నాం.
ఇప్పుడు సాక్షి రెజ్లింగ్‌ను వదిలేసినప్పుడు 2016 సంవత్సరాన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నాను. మహిళా అథ్లెట్లు ప్రభుత్వ ప్రకటనలకు మాత్రమే పరిమితమా?.. ప్రభుత్వ నినాదాలు మహిళల అభ్యున్నతికి కృషి చేస్తాయని అనిపించినప్పుడు ఆ ప్రకటనల్లో కనిపించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒలింపిక్ మెడల్ సాధించాలని కలలుగన్నా. కానీ, ఇప్పుడు ఆ కల చెదిరిపోయేలా కనిపిస్తుంది. రాబోయే మహిళా అథ్లెట్ల కలలైనా నెరవేరాలని కోరుకుంటున్నా. మహిళా రెజ్లర్లుగా కొన్నేళ్లుగా ఎలాంటి కష్టాలు పడ్డామో మాకు మాత్రమే తెలుసు. మీడియా ముందు అతను ఏం మాట్లాడాడో కేవలం ఐదు నిమిషాలు కేటాయించి చూడండి. అతను ఏం చేశాడో మీకు తెలుస్తుంది. సర్.. మా పతకాల విలువ 15 రూపాయలా?. ఆ పతకాలు మా ప్రాణాలకంటే విలువైనవి.
మేము పతకాలు గెలిచినప్పుడు దేశం మొత్తం సంబరాలు చేసుకుంది. కానీ, ఇప్పుడు మేము న్యాయం కోసం మాట్లాడితే దేశ ద్రోహులు అంటున్నారు. ప్రధానమంత్రి నేను మిమ్మల్ని ఒక్కటే అడగలనుకుంటున్నా.. మేము దేశద్రోహులమా?. నేను గెలుచుకున్న మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డులకు ఇప్పుడు నా జీవితంలో అర్థం లేదు. ఈ అవార్డులు అందుకునేటప్పుడు మా అమ్మ అందరికీ స్వీట్లు పంచుతూ వినేశ్‌ను టీవీలో చూడాలని చెప్పింది. కానీ, మేము ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసి మిగతా వాళ్లు మా అమ్మతో ఏం చెబుతారో అని ఎన్నో సార్లు అనుకున్నా. ఏ తల్లి తన కూతురిని ఇలా చూడాలని కోరుకోలేదు. ప్రతి మహిళా గౌరవప్రదంగా జీవించాలనుకుంటుంది. గౌరవంగా జీవించే క్రమంలో ఈ అవార్డులు నాకు భారం కాకూడదని తిరిగి ఇవ్వాలనుకుంటున్నా.’ అని వినేశ్ రాసుకొచ్చింది. కాగా, డబ్ల్యూఎఫ్‌ఐ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కారణంగా కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్ ప్యానెల్‌పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.