- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chairman Guttha: ఆ కేసు గురించి నాకు తెలియదు.. మండలి చైర్మన్ గుత్తా ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఫార్ములా ఈ-రేసు కేసు (Formula E-Race Case) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇవాళ బంజారాహిల్స్ (Banjara Hills)లో ఏసీబీ (ACB) కార్యాలయానికి విచారణకు హాజరైన కేటీఆర్ నానా హంగామా చేశారు. తన వెంట లాయర్లను ఏసీబీ అధికారులు విచారణకు లోనికి అనుమతించకపోవడంతో ఆయన తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case) అంశంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. అసలు ఫార్ములా ఈ-రేస్ కేసు గురించి తనకు తెలియదని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పంట పెట్టుబడి సాయం కింద రూ.12 వేల అర్ధిక సాయం చేయడం శుభ పరిణామమని అన్నారు. తాను రాష్ట్రానికి మొదటి ‘రైతుబంధు’ (Raithu Bandhu) అధ్యక్షుడినని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పాలనలో కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్ (Krishna Basin Project) పూర్తి నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వందకు వంద శాతం అమలు చేసిన ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేవని.. అందులో కొన్ని ఆచరణ సాధ్యం కాని హామీలు కూడా ఉంటాయని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.