Usman Ghani: క్రికెట్‌ బోర్డుపై అవినీతి ఆరోపణలు.. యువ ఓపెనర్‌ సంచలన నిర్ణయం

by Vinod kumar |
Usman Ghani: క్రికెట్‌ బోర్డుపై అవినీతి ఆరోపణలు.. యువ ఓపెనర్‌ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కప్‌ సమీపిస్తున్న వేళ.. అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుపై ఆ జట్టు ఓపెనర్‌ ఉస్మాన్‌ ఘని తీవ్ర అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా వరుసగా పోస్టులు పెట్టడంతో పాటుగా.. అలాగే క్రికెట్ బోర్డు పెద్దలపై అవినీతి ఆరోపణలు గుప్పించాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు (జులై 5 నుంచి జులై 11 వరకు) ప్రకటించిన జట్టులో ఘనికి చోటు దక్కలేదు. అఫ్గాన్‌ క్రికెట్ బోర్డు నాయకత్వం అవినీతిలో కూరుకుపోవడంతోనే ఇలా జరిగిందని ఘని వ్యాఖ్యానించాడు.

'చాలా నిశితంగా పరిశీలించిన తర్వాత అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ నుంచి విరామం తీసుకుందామని నిర్ణయించుకున్నా. అవినీతితో కూడిన అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు తీరు నన్ను ఆట నుంచి వెనక్కి తగ్గేలా చేసింది. విరామం తీసుకుంటాను కానీ.. నా హార్డ్‌ వర్క్‌ను కొనసాగిస్తా. సరైన మేనేజ్‌మెంట్‌ వచ్చినప్పుడు కచ్చితంగా తిరిగి వస్తా. అనేకసార్లు వెళ్లినా.. ఏసీబీ ఛైర్మన్ అందుబాటులో లేకపోవడంతో కలవలేకపోయా. నన్ను అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పించడంపై చీఫ్ సెలెక్టర్‌ నుంచి సరైన స్పందన రాలేదు' అని ఉస్మాన్‌ ఘని ట్వీట్ చేశాడు. అఫ్గానిస్థాన్‌ తరఫున ఉస్మాన్‌ ఘని 17 వన్డేలు, 35 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 1,200కుపైగా పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 6 హాఫ్ సెంచరీ ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed