డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమ్ ఇండియాలో ఆందోళన

by Mahesh |
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమ్ ఇండియాలో ఆందోళన
X

కోల్‌కతా : వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ గాయం బారిన పడ్డాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న ఉమేశ్.. బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్‌లో అతను తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు.

దాంతో శనివారం గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌కు ఉమేశ్ దూరమయ్యాడు. అతని గాయం తీవ్రతపై స్పష్టత లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ఉమేశ్ యాదవ్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌ వేదికగా జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అప్పటివరకు అతను గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించాల్సిన అవసరం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed