ఐదో టెస్టులో ఇద్దరికి రెస్ట్.. బుమ్రా రిటర్న్ !

by Swamyn |
ఐదో టెస్టులో ఇద్దరికి రెస్ట్.. బుమ్రా రిటర్న్ !
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదో టెస్టు మ్యాచ్‌కు స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. పలు కారణాలతో నాలుగో టెస్టుకు దూరమైన బుమ్రా.. వచ్చే నెల 7 నుంచి ధర్మశాల వేదికగా జరిగే మ్యాచ్‌కు తిరిగి జట్టులోకి రానున్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే, మరో ఇద్దరు ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని టీమ్ ఇండియా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒక బ్యాటర్, ఒక బౌలర్ ఉన్నట్టు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఇప్పటికే 3-1తో సిరీస్ దక్కించుకున్న టీమ్ ఇండియా.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో ఇద్దరికి విశ్రాంతినివ్వాలని భావిస్తున్నట్టు పేర్కొంది. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. ఇక, గాయం కారణంగా చివరి మూడు టెస్టులకు దూరమైన కేఎల్ రాహుల్.. ఐదో టెస్టుకు సైతం అందుబాటులోకి రాడని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్టు తెలిపింది. గాయం నుంచి రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఐదో టెస్టుకూ దూరంగానే ఉండనున్నట్టు పేర్కొంది.


Advertisement

Next Story