SA vs IND : తిలక్ వర్మ సెంచరీ..భారత్ 219 పరుగుల భారీ స్కోర్

by Y. Venkata Narasimha Reddy |
SA vs IND : తిలక్ వర్మ సెంచరీ..భారత్ 219 పరుగుల భారీ స్కోర్
X

దిశ, వెబ్ డెస్క్ : సౌతాఫ్రికా(South Africa) ఇండియా మధ్య (India) జరుగుతున్న మూడో టీ20లో తిలక్ వర్మ(Tilak Verma ) దూకుడైన ఆటతో (107*: 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు) శతకంతో మెరిశాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తిలక్ సూపర్ సెంచరీతో సౌతాఫ్రికా ముందు టీమిండియా భారీ లక్ష్యం ఉంచింది. తిలక్ వర్మ 51 బంతుల్లో శతకం బాదాడు. టీ20ల్లో అతడికిదే తొలి సెంచరీ.

ఓపెనర్ అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. హార్దిక్ పాండ్య (18), రమణ్ దీప్ సింగ్ (15) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సిమోలన్, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మార్కో యాన్సెస్ ఒక వికెట్ తీశారు.

Advertisement

Next Story