ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

by Mahesh |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకొని ఇద్దరు యువకులు మృతి(Two youths died) చెందారు. ఈ విషాద ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ వద్ద చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ తో పాటు చెట్టు ను కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. కాగా మృతులను బోరబండ కు చెందిన రఘుబాబు, ఆకాన్ష్‌గా గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బైక్(Bike) నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తు(Alcohol intoxication)లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో వేగంగా వెళ్తున్న బైక్.. డివైడర్ ను ఢీ కొట్టి.. జారుకుంటూ దూసుకెళ్లడం స్పష్టంగా కనిపించింది.

Advertisement

Next Story

Most Viewed