- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Reliance Jio: యూజర్లకు జియో బిగ్ షాక్.. డేటా వోచర్ల వ్యాలిడిటీ తగ్గింపు..!

దిశ,వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ జియో(Reliance Jio) తన వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. రోజువారీ డేటా లిమిట్(Data Limit) అయిపోయినప్పుడు యూజర్లు వేసుకునే రూ.19, రూ.29 డేటా వోచర్ల(Data Vouchers) వ్యాలిడిటీని తగ్గించింది. కాగా రోజువారీ డేటా అయిపోయినప్పుడు ఇంటర్నెట్ సేవలు పొందేందుకు యూజర్లకు రూ. 19, రూ. 29 ప్లాన్ తో 1జీబీ, 2జీబీ డేటా వోచర్లను జియో అందిస్తోంది. ప్రస్తుతం కస్టమర్లు వేసుకున్న నెల/ మూడు నెలలు ప్లాన్ గడువు ముగిసే వరకు ఈ డేటా వోచర్ల వ్యాలిడిటీ ఉండేది. తాజాగా జియో ఈ డేటా వోచర్ల వ్యాలిడిటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ. 19 ప్లాన్ ను ఒక రోజుకు, రూ. 29 ప్లాన్ ను రెండు రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా జియో తీసుకున్న నిర్ణయంపై కస్టమర్లు మండిపడుతున్నారు. జియో రోజురోజుకు ఎయిర్‌టెల్(Airtel), వొడాఫోన్ ఐడియా(vi) ప్లాన్‌లకు చేరువవుతోందని, వాటితో పోల్చుకుంటే నెట్‌వర్క్ మినహా పెద్దగా తేడా లేదని 'ఎక్స్(X)' వేదికగా పోస్టులు పెడుతున్నారు.