నేరాల నివారణపై పోలీసుల కసరత్తు... నల్లగొండలో సమీక్షా సమావేశం

by Kavya |
నేరాల నివారణపై పోలీసుల కసరత్తు... నల్లగొండలో సమీక్షా సమావేశం
X

దిశ, నల్లగొండ క్రైం: ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి, గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తిగా పారదర్శకంగా చేయాలని అన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా కేసు నమోదు నుండి చార్జ్‌షీట్ దాఖలువరకు అన్ని దశలను సమగ్రంగా పరిశీలించాల్సిందిగా సూచించారు.

ఫోక్సో ఇతర తీవ్ర నేరాలపై త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి, చార్జ్‌షీట్ కోర్టులో వేయాలని సూచించారు. ప్రతి పోలీస్ అధికారికి పై పూర్తి అవగాహన ఉండాలని, స్టేషన్ మేనేజ్‌మెంట్, విచారణ వ్యవస్థలపై పూర్తి పట్టు కలిగి ఉండాలన్నారు.

అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు పాత కేసులనూ ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తూ, న్యాయం చేకూర్చేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. గ్రామ పోలీస్ అధికారులు రోజూ గ్రామాలను సందర్శించి, ప్రజలతో మమేకం అవుతూ నేర నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీటీవీల ఏర్పాటు, అవగాహన కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.

మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ, ప్రజా రక్షణనే ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించాలని తెలిపారు. సైబర్ నేరాలు, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు మరియు ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి ఫిర్యాదులపై జవాబుదారీగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్‌ చెక్‌లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్ల వాహన రాకపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్స్‌ చేపట్టాలని చెప్పారు.

అసాంఘిక కార్యకలాపాలు గంజాయి రవాణా, జూదం, అక్రమ పీడీఎస్ రవాణా వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడే వారిపై చర్యలు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీ నారాయణ, సీఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed