IND vs WI: చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా యువ ప్లేయర్..

by Vinod kumar |
IND vs WI: చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా యువ ప్లేయర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా యువ ఆటగాడు తిలక్ వర్మ అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లోనే 2 సిక్సర్లు బాదాడు. ఓవరాల్‌గా 22 బంతులు ఆడి 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలి మ్యాచ్‌లో సంచలన బ్యాటింగ్‌ చేసిన తిలక్.. ఓ అరుదైన ఘనతను సాధించాడు. విదేశీ గడ్డపై టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత ఆటగాడిగా రాహుల్‌ ద్రవిడ్‌, మురళీ విజయ్‌తో కలిసి సంయుక్తంగా తిలక్‌ నిలిచాడు.

అంతకుముందు మురళీ విజయ్‌ 2010 లో తన డెబ్యూ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌పై 3 సిక్స్‌లు బాదగా.. 2011లో రాహుల్‌ ద్రవిడ్‌ కూడా తన అరంగేట్ర మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 3 సిక్స్‌లు కొట్టాడు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత తిలక్‌ వర్మ ఈ అరుదైన ఫీట్‌ సాధించాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో తిలక్‌ మరో అరుదైన రికార్డును కూడా సాధించాడు. టీ20ల్లో అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో 30కు పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా వర్మ చరిత్ర సృష్టించాడు. తిలక్‌ 177.27 స్ట్రైక్‌రేట్‌తో 39 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌‌లో.. విండీస్‌ చేతిలో 4 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed