- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ లో మైనర్ బాలిక అదృశ్యం
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీకి సమీపం లోని బుడుగ జంగాల కాలనీ కి చెందిన ఒక బాలిక(16) అదృశ్యం అయినట్లు బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంత్రం కిరాణా షాపునకు వెళ్లిన బాలిక అదృశ్యం కాగా చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దాంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా ఇదే ప్రాంతానికి చెందిన శేఖర్ అనే వివాహితుడు సైతం ఇదే సమయంలో అదృశ్యం కావడంతో ఇతనిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు.
బాలిక అదృశ్యం పై విచారణ చేస్తున్నాం : సీఐ తిరుమల్
బాలిక అదృశ్యం అయిన విషయం వాస్తవమే అని, శేఖర్ అనే వ్యక్తి ఇదే సమయంలో కనిపించకపోవడంతో అతనిపై అనుమానం ఉన్నట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
- Tags
- missing