చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు.. వరుసగా మూడో విజయం

by Harish |
చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు.. వరుసగా మూడో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు అదరగొడుతున్నాయి. టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశాయి. శుక్రవారం మూడో రౌండ్‌లో పురుషుల జట్టు 3.5-0.5 తేడాతో ఆతిథ్య టీమ్ హంగేరీ ‘బి’ జట్టును చిత్తు చేసింది. మొదట విదిత్ సంతోష్ గుజరాతి.. పాప్ గాబోర్‌తో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. మరో మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు అర్జున్ ఎరిగేసి భారత్‌కు తొలి విజయాన్ని అందించాడు. పీటర్ ప్రోహస్కాను 33 ఎత్తుల్లో చిత్తు చేశడు. మరో భారత గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్ భారత్ ఆధిక్యాన్ని 2.5-0.5కు పెంచి భారత్ గెలుపును ఖరారు చేశాడు. కొజాక్ ఆజమ్‌ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్నప్పటికీ గుకేశ్ 54 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. ఇక, ఆర్.ప్రజ్ఞానంద తనదైన స్టైల్‌లో భారత్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టాడు. బనుస్జ్ తామస్‌ను ఓడించడంతో 3.5-0.5 తేడాతో భారత్ గెలుపొందింది. తొలి రెండు మ్యాచ్‌లో మొరాకో, ఐస్‌లాండ్‌ జట్లపై విజయాలు సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు, మహిళల జట్టు కూడా జోరు ప్రదర్శిస్తున్నది. స్విట్జర్లాండ్‌ను 3-1 తేడాతో మట్టికరిపించింది. ద్రోణవల్లి హారిక పరాజయం పాలవ్వగా.. వైష్ణవి రమేశ్ బాబు, దివ్య దేశ్‌ముఖ్, వంతికా అగర్వాల్ విజయాలు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed