సీత ఔర్‌ గీత : యువ ఓపెనర్లపై కోహ్లీ ఫన్నీ కామెంట్

by Harish |
సీత ఔర్‌ గీత : యువ ఓపెనర్లపై కోహ్లీ ఫన్నీ కామెంట్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ బ్యాటర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. అయితే, వారి ఫ్రెండ్‌షిప్‌‌పై టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫన్నీ కామెంట్ చేశాడు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న విరాట్.. టీమ్ ఇండియాలో వారిని ‘సీతా ఔర్‌ గీతా’ మూవీలోని కవలలతో పోల్చాడు. ‘వారి ఫ్రెండ్‌షిప్ భలే సరదాగా ఉంటుంది. సీతా ఔర్ గీత. పర్యటనల్లో వారిద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండరు. ఆహారం కోసం బయటకు వెళ్తే వారు కలిసే వస్తారు. టీమ్ డిస్కషన్స్‌లోనూ కలిసే ఉంటారు. వారు విడిగా ఉండటాన్ని నేను చూడలేదు. వాళ్లు గొప్ప స్నేహితులు.’ అని కోహ్లీ తెలిపాడు.

Advertisement

Next Story