సంజిత చానుపై నాలుగేళ్ల నిషేధం

by Javid Pasha |
సంజిత చానుపై నాలుగేళ్ల నిషేధం
X

న్యూఢిల్లీ : భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ సంజిత చానుపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (ఎన్ఏడీఏ) నాలుగేళ్ల నిషేధం విధించింది. డోప్ పరీక్షలో ఆమె శాంపిల్స్‌లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (డబ్ల్యూఏడీఏ) నిషేధిత అనబాలిక్ స్టెరియాడ్ డ్రోస్టనొలోన్ మొటబొలైట్‌‌ను గుర్తించారు. సంజిత చాను నిషేధాన్ని ఇండియన్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు సహదేవ్ యాదవ్ ధ్రువీకరించాడు. ఈ నిషేధంతో సంజితకు కోలుకోలేని దెబ్బ తగిలినట్టయింది.

ఈ ఏడాది జరగబోయే ఏషియన్ గేమ్స్‌తోపాటు పారిస్ ఒలింపిక్స్-2024లో ఆమె పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, దీనిపై సంజిత అప్పీల్ చేసుకునే అవకాశముంది. సంజితా డోపింగ్‌లో పట్టుబడటం ఇది తొలిసారేమీ కాదు. 2018లోనూ ఈమెపై ఐడబ్ల్యూఎఫ్ నిషేధపు వేటు వేసింది. కానీ ఆమె శాంపిల్స్‌లో ఖచ్చితమైన ఫలితాలు రాకపోవడంతో 2020లో దాన్ని ఉపసంహరించుకుంది. కాగా, 2014, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో సంజిత చాను స్వర్ణ పతకాలు గెలుచుకుంది.

Advertisement

Next Story

Most Viewed