Paris Olympics : ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో లాస్ట్ సప్పర్ షో..! పేర‌డీపై తీవ్ర వివాదం!

by Ramesh N |
Paris Olympics : ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో లాస్ట్ సప్పర్ షో..! పేర‌డీపై తీవ్ర వివాదం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సెయిన్ నదిలో శుక్రవారం ఓపెనింగ్ సంబరాలు జరిగాయి. నదిలో 6 కిలోమీటర్ల మేర పరేడ్ జరిగింది. నదికి ఇరువైపు సంగీత ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అయితే, ప్రారంభోత్స‌వ సంబ‌రాల్లో క‌ళాకారులు ప్ర‌ద‌ర్శించిన లాస్ట్‌ స‌ప్ప‌ర్ పేర‌డీపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

లియోనార్డో డావిన్సీ పెయింటింగ్ ఆధారంగా భారీ టేబుల్ ముందు జీసెస్‌తో పాటు అత‌ని 12 మంది శిష్యులు భోజ‌నం చేసిన‌ట్లు ఉన్న ఫోటో గురించి తెలిసిందే. అయితే, దానిపై ఓపెనింగ్ సెర్మ‌నీలో డ్రాగ్ క్వీన్ క‌ళాకారులు లాస్ట్ స‌ప్ప‌ర్ పేర‌డీ చేశారు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. క్రైస్త‌వ క‌మ్యూనిటీలు ఈ పేర‌డీపై తీవ్రంగా మండిపడుతున్నాయి. మరోవైపు ఇది క్యాథ‌లిక్ క్రైస్త‌వుల‌ను అవ‌మానించ‌డ‌మే అని సోష‌ల్‌మీడియా నెటిజన్స్ ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed