- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకే సెలబ్రేషన్ చేసుకోలేదు : శుభ్‌మన్ గిల్
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమ్ ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. కీలక ప్లేయర్లు విఫలమవ్వగా.. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన అతను 147 బంతుల్లో 104 పరుగులు చేశాడు. గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లాండ్ ముందు భారత్ భారీ టార్గెట్ పెట్టింది. అయితే, సెంచరీ తర్వాత గిల్ పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోలేదు. గతంలో గిల్ సెంచరీ చేసినప్పుడు తన సిగ్నేచర్ ‘బో డౌన్’ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో శతకం బాదిన తర్వాత అతను అలాంటిది ఏం చేయలేదు. సాధారణంగానే బ్యాటు పైకెత్తి చూపించాడు. ఇది గమనించిన నెటిజన్లు గిల్ సెలబ్రేషన్స్ చేసుకోకపోవడంపై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
మూడో రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత దీనిపై గిల్ స్పందించాడు. తాను సెలబ్రేషన్స్ చేసుకోకపోవడానికి గల కారణాన్ని వివరించాడు. ‘సెంచరీ చేయడం బాగా అనిపించింది. కానీ, జట్టు తరపున నా పని ఇంకా పూర్తి కాలేదని నేను అనుకున్నా. అందుకే, చిన్నగా సెలబ్రేషన్స్ చేసుకున్నా.’ అని గిల్ రివీల్ చేశాడు.
కాగా, కొంతకాలంగా టెస్టుల్లో గిల్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. హైదరాబాద్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా కూడా తెరవలేదు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లోనూ 34 పరుగులకే అవుటయ్యాడు. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో రెండో టెస్టులో రాణించకపోతే జట్టును తప్పిస్తామని గిల్‌కు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో విమర్శలకు సమాధానమిచ్చాడు. గతేడాది మార్చిలో ఆస్ట్రేలియాపై తొలి శతకం బాదిన అతను.. దాదాపు 11 నెలల తర్వాత రెండో టెస్టు సెంచరీని నమోదు చేశాడు.