- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20 ప్రపంచకప్: పాకిస్తాన్ విజయం కోసం భారత జట్టు ఎదురుచూపులు
దిశ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్(CC Womens T20 World Cup) రసవత్తరంగా సాగుతోంది. ప్రతి సంవత్సరం లాగానే ప్రధాన జట్ల మధ్యే మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న ఆస్ట్రేలియా, భారత్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత్ ఓడిపోయి సెమీస్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మొత్తం నాలుగు మ్యాచ్ లో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు సెమీస్ చేరుకుంది. అలాగే నాలుగు మ్యాచుల్లో రెండు మ్యాచులు మాత్రమే గెలిచిన భారత మహిళల జట్టు నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా భారత్ సెమీస్ చేరాలంటే.. ఈ రోజు పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యచులో పాకిస్తాన్ గెలవాల్సి ఉంది. అది కూడా తక్కువ మార్జిన్ తో మాత్రమే గెలవాలి. ఒకవేళ పాకిస్తాన్ జట్టు భారీ తేడాతో పాక్ గెలిస్తే.. పాక్ సెమీస్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా న్యూజిలాండ్ గెలిస్తే..నేరుగా సెమిస్ చేరుకుంటుంది. దీంతో భారత క్రికెట్ అభిమానులు పాకిస్థాన్ జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. మరీ ఈ మ్యాచులో పాక్ గెలిచి భారత్‌ను సెమీస్ కు పంపుతుందా.. లేఖ భారీ తేడాతో విజయం సాధించే పాకిస్థాన్ జట్టే.. నేరుగా సెమీస్ వెళ్తుందో తెలియాలంటే ఈ రోజు రాత్రి వరకు వేచి చూడాల్సిందే మరి.