జాతీయ అథ్లెటిక్స్ ప్రారంభం.. బరిలోకి అగ్రశ్రేణి అథ్లెట్లు

by Hajipasha |
జాతీయ అథ్లెటిక్స్ ప్రారంభం.. బరిలోకి అగ్రశ్రేణి అథ్లెట్లు
X

దిశ,స్పోర్ట్స్ : జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భారత అగ్రశ్రేణి అథ్లెట్లు బరిలో నిలిచారు. వచ్చే నెల ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్ కోసం చాలా మంది అథ్లెట్లు ఈ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. అయితే, పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో చాంపియన్ షిప్ సాధించడమే ధ్యేయంగా నీరజ్ చోప్రా ప్రస్తుత పోటీల్లో పాల్గొనడం లేదు. ప్రస్తుతం అతను ఒలింపిక్స్ కోసం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇక పారిస్ బెర్తులు సాధించేందుకు ఈ పోటీల్లో జ్యోతి యర్రాజి (మహిళల 100 మీటర్ల హర్డిల్స్), అన్ను రాణి (మహిళల జావెలిన్ త్రో), డి.పి మను (పురుషుల జావెలిన్ త్రో), తజిందర్ సింగ్ తూర్ (పురుషుల షాట్‌పుట్), జెస్విన్ ఆల్డ్రిన్ (పురుషుల లాంగ్ జంప్) ఒలింపిక్స్ బెర్తులపై గురిపెట్టారు.

Advertisement

Next Story

Most Viewed