తండ్రి గుర్తుగా నెంబర్ 18 జెర్సీ.. విరాట్ కోహ్లీ

by Vinod kumar |   ( Updated:2023-03-26 09:52:49.0  )
తండ్రి గుర్తుగా నెంబర్ 18 జెర్సీ.. విరాట్ కోహ్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ సారథి, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ధరించే జెర్సీపై నెంబర్ 18 ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఏ ఫార్మాట్‌లో మ్యాచ్ ఆడుతున్నా సరే కోహ్లీ ధరించే జెర్సీపై కచ్చితంగా అదే నెంబర్ ఉంటుంది. భారత జట్టులోకి అడుగుపెట్టిన నాటి నుంచి అదే నెంబర్ జెర్సీని కోహ్లీ ధరించాడు. మరో నెంబర్ మార్చే ప్రయత్నం చేయలేదు. ఈ నెంబర్ కు కోహ్లీకి ఉన్న సంబంధం ఏంటనే దానిపై ఆయన అభిమానులకు పలు సందేహాలు ఉన్నాయి. దీనిపై కోహ్లీ ఇటీవల వివరణ ఇచ్చాడు. ఆ నెంబర్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. తన తండ్రి గుర్తుగా నెంబర్ 18 ధరిస్తున్నట్లు వివరించాడు.

2006 డిసెంబర్ 18వ తేదీ.. తన జీవితంలో మర్చిపోలేని రోజు అని కోహ్లీ చెప్పాడు. ఆ రోజు కర్ణాటకతో జరిగే రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున కోహ్లీ ఆడాల్సి ఉండగా.. అదేరోజు తెల్లవారుజామున కోహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీ గుండెపోటుతో చనిపోయారు. పదిహేడేళ్ల వయసున్న కోహ్లీ దు:ఖం దిగమింగి వెళ్లి మ్యాచ్ ఆడాడు. ఆ రోజు 90 పరుగులు చేశాడు. మ్యాచ్ పూర్తయ్యాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఈ ఘటనపై కోహ్లీ మాట్లాడుతూ.. తండ్రి మరణించిన రోజు తాను వ్యక్తిగా మారానని తెలిపాడు. కఠిన నిర్ణయాలు తీసుకున్నానని గతాన్ని గుర్తుచేసుకున్నాడు. ఈ లోకాన్ని వీడిపోయిన తన తండ్రి గర్తుగా ఆ జెర్సీని ధరిస్తున్నానని కోహ్లీ చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed