- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సారి ఐపీఎల్‌ను ఏలేది ఆ ఐదుగురే: సౌరవ్ గంగూలీ
న్యూఢిల్లీ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, పృథ్వీషా, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో భవిష్యత్తులో పెద్ద స్టార్లుగా మారుతారని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో ఐపీఎల్‌లో సత్తాచాటే ఆటగాళ్లు ఎవరు? అని ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు గంగూలీ పై ఐదుగురు ఆటగాళ్ల పేర్లు బదులిచ్చాడు.
ఈ జాబితాలో సూర్యకుమార్ టాప్ ప్లేస్ ఉంటాడని, అతన్ని యువ క్రికెటర్ కింద పరిగణలోకి తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పాడు. ‘నం. 2 రిషబ్ పంత్. ఇప్పుడే ప్రపంచం అతని కాళ్ల దగ్గర ఉంది. పృథ్వీ షా చాలా టాలెంట్ ఉన్న ఆటగాడు. రుతురాజ్ గైక్వాడ్‌పై కూడా ఒక లుక్కేసి ఉంచుతా. అతను ఎలా ఆడతాడో గమనిస్తూ ఉండటం మంచిది’ అని గంగూలీ చెప్పాడు.
బౌలర్ల విషయానికొస్తే యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ భవిష్యతుల్లో సూపర్ స్టార్ అవుతాడని దాదా అభిప్రాయపడ్డాడు. ఇక, ఈ జాబితాలో 5వ ఆటగాడిగా దాదా శుభ్‌మన్ గిల్‌ను ఎంచుకున్నాడు. కాగా, మార్చి 31 నుంచి ఐపీఎల్-16 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.