గాల్లో బంతి.. టీ షర్ట్, బాక్సర్ విప్పెసి క్యాచ్ పట్టిన ప్లేయర్..(వీడియో)

by Mahesh |
గాల్లో బంతి.. టీ షర్ట్, బాక్సర్ విప్పెసి క్యాచ్ పట్టిన ప్లేయర్..(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ ప్లేయర్ మార్క్ వుడ్ గాల్లోకి లేసిన బంతిని తన టీ షర్ట్, బాక్సర్ విప్పెసి క్యాచ్‌ను పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో బంగ్లాదేశ్‌లో జరిగిన ఫీల్డింగ్ డ్రిల్‌లో ఇంగ్లాండ్ కు చెందిన పేసర్ మార్క్ వుడ్ తన గాల్లోకి ఎగిరిన బంతిని పట్టుకోవడానికి తన బట్టలు విప్పుతున్నట్లు కనిపించింది. వుడ్ తన టోపీ, సన్ గ్లాసెస్, టీ షర్ట్, షార్ట్‌లను అత్యంత వేగంగా తీసేపి బంతికోసం పరుగెత్తికెళ్లి క్యాచ్ పట్టుకుని నేలపై పడిపోతాడు.

అయితే వారు ఫిల్డింగ్‌లో రానించడానికి ఈ విధంగా ప్రాక్టిస్ చేస్తున్నారు. దీని అర్ధం ఎటువంటి పరిస్థితుల్లో అయినా క్యాచ్‌ను తీసుకొగలగాలి అని. ఎందుకంటే క్రికెట్‌లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అని అందరూ నమ్ముతారు. ఫీల్డింగ్‌లో ఒక్క క్యాచ్ మిస్ అయినా సరే పూర్తి టీం విజయాన్ని మార్చగలదు. అందుకే ఇంగ్లాండ్ కోచ్ వారితో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తుండవచ్చు అని ఆ వీడియోపై క్రికెట్ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story