- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అందుకే స్పాట్ ఫిక్సింగ్ చేశా.. జింబాబ్వే మాజీ కెప్టెన్
హరారే : జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ తనపై వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఎట్టకేలకు నోరు విప్పి, సోషల్ మీడియా వేదిక స్పాట్ ఫిక్సింగ్ గురించిన చీకటి కోణాన్ని బహిర్గతం చేశాడు. సోమవారం అతను ట్విట్టర్‌లో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2019లో ఓ భారతీయ వ్యాపారి తనను ఇండియాకు పిలిపించారని, ఓ హోటల్ గదిలో తనతో పాటు మరికొందరు ఉన్నారని చెప్పారు. జింబాబ్వేలో టీ20 మ్యాచులు ప్లాన్ చేస్తున్నట్టు అందుకోసం స్పాన్సర్లతో మాట్లాతున్నట్టు చెప్పారని, ఈ క్రమంలోనే తనకు కొకైన్ ఆఫర్ చేశారని తను తీసుకున్న టైంలో వీడియో రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేశారని గుర్తుచేశారు.
తన కుటుంబ భద్రత గురించి ఆలోచించి, ఆ వీడియోలు ఎక్కడ బయట పెడతారేమో అని భయంతో వారు చెప్పిన దానికి ఓకే చెప్పినట్టు టేలర్ వెల్లడించాడు. తనకు 15 వేల డాలర్లు ఆఫర్ చేశారని, పని పూర్తయ్యాక మరో 20వేల డాలర్లు ఇవ్వనున్నట్టు డీల్ కుదిర్చారని వివరించారు. తన ట్రాప్‌లో చిక్కుకున్నందున చేసేదేమి లేక డబ్బులు తీసుకుని స్పాట్ ఫిక్సింగ్ చేశానని, ఆ తర్వాత 4 నెలలకు ఐసీసీకి ఈ విషయాన్ని వివరించగా తనపై రెండేళ్ల నిషేధం విధించారని బ్రెండన్ టేలర్ చెప్పుకొచ్చాడు. 35 ఏళ్ల టేలర్ ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లి రికవరీ అయినట్టు తెలిపాడు.