- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్‌ను మట్టికరిపించిన నోస్కోవా
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. ఉమెన్స్ సింగిల్స్ వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్ మూడో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది. నాలుగు గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన విజేతను అన్‌సీడ్ ప్లేయర్ లిండా నోస్కోవా మట్టికరిపించింది. చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి లిండా నోస్కోవా సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో వరల్డ్ నం.1, పొలాండ్‌కు చెందిన స్వైటెక్‌ను 6-3, 3-6, 4-6 తేడాతో ఓడించింది. 2 గంటల 20 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో మూడో సెట్‌లో నోస్కోవా విజయం ఖాయమైంది. అయితే, ఈ మ్యాచ్‌ల ఆరంభం మాత్రం స్వైటెక్‌దే. తొలి సెట్‌ను ఆమె సునాయాసంగా గెలుచుకుంది. 4వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోసహా వరుసగా మూడు గేమ్‌లను నెగ్గి ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె 9వ గేమ్‌లో సెట్‌ను దక్కించుకుంది. అనంతరం నోస్కోవా పుంజుకుంది. రెండో సెట్‌లో నువ్వానేనా అన్నట్టు పోరాడిన నోస్కోవా.. స్వైటెక్‌కు షాకిచ్చింది. వరుసగా 4వ, 5వ, 6వ గేమ్‌లను నెగ్గి రెండో సెట్‌ను సాధించింది.
ఇక, నిర్ణయాత్మక మూడో సెట్ కూడా ఆసక్తికరంగా సాగింది. 3వ గేమ్‌లో స్వైటెక్ సర్వీస్‌ను నోస్కోవా బ్రేక్ చేస్తే..4వ గేమ్‌లో నోస్కోవా సర్వీస్‌ను స్వైటెక్ బ్రేక్ చేసింది. వీళ్ల దూకుడు చూస్తుంటే సెట్ టై బ్రేకర్‌కు వెళ్లాలని కనిపించింది. ఈ పరిస్థితుల్లో స్వైటెక్‌ను గట్టి దెబ్బకొట్టిన నోస్కోవా.. 7వ గేమ్‌లో మరోసారి బ్రేక్ పాయింట్ సాధించడంతోపాటు 8వ గేమ్‌నూ నెగ్గి 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. 9వ గేమ్‌ను స్వైటెక్ నెగ్గినప్పటికీ.. 10వ గేమ్‌లో నోస్కోవా సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. అద్భుతమైన పోరాట పటిమ కనబర్చిన నోస్కోవా ఓ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారిగా ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. అంతేకాకుండా 1999 తర్వాత వరల్డ్ నం.1ను ఓడించిన టీనేజర్‌గా నిలిచింది. మరోవైపు, స్వైటెక్ తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కల మరోసారి నాలుగో రౌండ్‌లోనే చెదిరింది. గత ఎడిషన్‌లోనూ ఆమె నాలుగో రౌండ్‌లోనే వెనుదిరిగింది.