మహిళా క్రికెటర్‌తో టీంఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ పెళ్లి.. డేట్ ఫిక్స్

by Sathputhe Rajesh |
మహిళా క్రికెటర్‌తో టీంఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ పెళ్లి.. డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ విక్టరీని ఎంజాయ్ చేస్తోంది. సోమవారం జరిగిన ఫైనల్ లో చెన్నై గుజరాత్ పై సెన్సేషనల్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అయితే భారత జట్టు ఆటగాడు, సీఎస్కే డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఓ బ్యూటిఫుల్ గర్ల్‌తో ఫోటో దిగాడు. అంతటితో ఆగకుండా సీఎస్కే కెప్టెన్ ధోనితో కూడా ఇద్దరు కలిసి ఫోటోకు ఫోజిచ్చారు. ఆ అమ్మాయిని రుతురాజ్ గైక్వాడ్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. అమ్మాయి పేరు ఉత్కర్ష కాగా వీరిద్దరు జూన్ 3-4 తేదీల్లో ఒక్కటి కానున్నారు.

అయితే వీరిద్దరు గతేడాది జిమ్ లో దిగిన ఫోటో అప్పట్లో వైరల్ అయింది. తర్వాత మాత్రం రుతురాజ్, ఉత్కర్ష తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. ఉత్కర్ష కూడా క్రికెటర్ కావడం విశేషం. ఆమె మహారాష్ట్ర జట్టు తరుపున ఆడుతున్నారు. పెళ్లి కారణంగా ఇంగ్లాండ్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి రుతురాజ్ గైక్వాడ్ రెస్ట్ తీసుకున్నట్లు తెలుసింది. రుతురాజ్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ముకేష్ కుమార్ లను టీమిండియా రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. వీరిద్దరు త్వరలో లండన్ వెళ్లనున్నారు. ఈ సీజన్ లో రుతురాజ్ 590 పరుగులు చేసి జట్టు ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా రుతురాజ్ భారత్ తరపున టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Advertisement

Next Story