Ishan Kishan మెరుపు సెంచరీ.. భారీ స్కోర్ దిశగా టీమిండియా

by GSrikanth |   ( Updated:2022-12-15 06:58:46.0  )
Ishan Kishan  మెరుపు సెంచరీ.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ పర్యటనలో చెత్త ప్రదర్శనతో విమర్శులు ఎదుర్కొంటున్న టీమిండియా.. చివరి వన్డేను సీరియస్‌గా తీసుకున్నది. వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడి సిరీస్ చేజార్చుకున్న భారత్‌.. నేడు చట్టోగ్రామ్ వేదికగా జరుగనున్న మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పట్టదలతో ఉంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌లో తన కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ దావన్ విఫలమైనా.. విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ ఇషాన్‌ కిషన్‌కు దూకుడుగా ఆడేందుకు అవకాశం ఇస్తూ అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కిషన్ (150), కోహ్లీ (50) పరుగులు చేశారు. జట్టు స్కోర్ రెండొందలకు చేరువలో ఉంది.

Advertisement

Next Story