Pune Test: టీమిండియా ఘోర పరాజయం.. సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

by Gantepaka Srikanth |
Pune Test: టీమిండియా ఘోర పరాజయం.. సిరీస్ కైవసం చేసుకున్న కివీస్
X

దిశ, వెబ్‌డెస్క్: పూణె వేదికగా న్యూజిలాండ్‌(New Zealand)తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా(Team India) ఘోర పరాజయం పాలైంది. ఇప్పటికే మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఓటమి చెందిన భారత్.. ప్రస్తుతం రెండో టెస్టు సైతం ఓడిపోవడంతో సొంత గడ్డపై సిరీస్ కోల్పోయింది. మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తో కివీస్ కైవసం చేసుకున్నది. ఈ టెస్టులో 133 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. కాగా, రెండో టెస్టులో భారత్(India) ఎదుట న్యూజిలాండ్(New Zealand) భారీ లక్ష్యం పెట్టింది.

తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల లీడ్‌ సాధించిన కివీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమ్‌ఇండియాకు 359 పరుగులను టార్గెట్‌ ఉంచింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు వచ్చిన భారత్‌ మళ్లీ తడబడింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(77), ఆల్ రౌండర్ జడేజా(42) తప్ప అందరూ నిరాశ పరిచారు. దీంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. భారత బ్యాటర్లలో రోహిత్(8), విరాట్(17), గిల్(23), పంత్(0), సుందర్(21), సర్ఫరాజ్(9), అశ్విన్(18), ఆకాశ్ దీప్(1), బూమ్రా(10) పరుగులు చేశారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోయింది.

Advertisement

Next Story