Ind Vs Nz 2nd Test :కష్టాల్లో టీమిండియా..153/5

by Y. Venkata Narasimha Reddy |
Ind Vs Nz 2nd Test :కష్టాల్లో టీమిండియా..153/5
X

దిశ, వెబ్ డెస్క్ : పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు(2nd Test)లో టీమిండియా(INDIA) 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఎదురీదుతోంది. న్యూజిలాండ్(New Zealand) బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి ప్రస్తుతం 153 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(8) పరుగులకు ఔటయినప్పటికి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (77), శుభమన్ గిల్(33) పరుగులతో భారత్ ను విజయం దిశగా ముందుకు నడిపించడంతో గెలుపు దిశగా ఆశలు రేగాయి. అయితే వారిద్ధరిని న్యూజిలాండ్ స్పిన్నర్లు అవుట్ చేయడంతో పాటు, విరాట్ కోహ్లీతో సమన్వయం లోపించి రిషబ్ పంత్ (0) పరుగుకే రనౌట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. కోహ్లీ 17 పరుగులకే వెనుతిరిగి మరోసారి నిరాశ పరిచాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ 11పరుగులతో, సర్పరాజ్ ఖాన్(0) పరుగుతో ఆడుతున్నారు.

-కివీస్ స్పిన్నర్ శాట్నర్ కే ఆ నాలుగు వికెట్లు దక్కడం విశేషం. అతను టీమిండియా తొలి ఇన్నింగ్స్ లోనూ 7వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలువాలంటే మరో 206పరుగులు చేయల్సి ఉంది. న్యూజిలాండ్ బౌలర్ల జోరు..పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండటంతో టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోవాంటే అధ్భుతం జరుగాల్సిందేనంటున్నారు క్రీడా నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed