Sanju Samson: జట్టులో స్థానం కాదు.. గెలవడం ముఖ్యం

by Gantepaka Srikanth |
Sanju Samson: జట్టులో స్థానం కాదు.. గెలవడం ముఖ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జట్టుకు అవసరమైనప్పుడల్లా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ.. గెలుపులో కీలక పాత్ర పోషిస్తుంటాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శాంసన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేస్తున్నా.. టీమిండియా తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. ఇదే ప్రతీసారి రిపీట్ అవుతోంది. దీంతో శాంసన్‌పై విమక్ష చూపుతున్నారనీ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు సైతం వచ్చాయి. తాజాగా వీటిపై సంజూ స్పందించారు. తనను ఏ స్థానంలో ఆడమంటే ఆ స్థానంలో ఆడుతానని అన్నారు. తుది జట్టులో నాకు చోటు దక్కిందా? లేదా? అనే దానికంటే మ్యాచ్ గెలవడం ముఖ్యంగా భావిస్తాను అని చెప్పారు. ప్రతీ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటానని అన్నారు.

Advertisement

Next Story