ధర్మశాల: టీమిండియా ఆలౌట్‌.. టోటల్ స్కోర్ ఎంతో తెలుసా?

by GSrikanth |
ధర్మశాల: టీమిండియా ఆలౌట్‌.. టోటల్ స్కోర్ ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానంలో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ సెంచరీలతో సత్తా చాటగా.. జైశ్వాల్, ఫడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్‌లు హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 124.1 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి.. 477 పరుగులు చేసింది. ప్రత్యర్థి ఇగ్లాండ్ ఎదుట 259 పరుగుల లీడ్ పెట్టింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 5 వికెట్లు తీయగా.. అండర్సన్, హార్ల్టీ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ రోహిత్ శర్మను ఔట్ చేసి ఒక వికెట్‌తో సరిపెట్టుకున్నారు. కాగా, తొలి ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్ కేవలం 218 పరుగులకే ఆలౌటైంది. జాక్ క్రాలీ(79) తప్పా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. కాసేపట్లో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభం కానుంది.

Advertisement

Next Story