T20 వరల్డ్ కప్: రోహిత్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్

by GSrikanth |
T20 వరల్డ్ కప్: రోహిత్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్‌ కోల్పోయి నిరాశలో ఉన్న టీమిండియా అభిమానులు తమ దృష్టి మొత్తం టీ20 వరల్డ్ కప్‌పై పెట్టారు. ఎలాగైనా ఈసారి టీ20 వరల్డ్ కప్ సాధించాలని సోషల్ మీడియా వేదికగా బీసీసీఐకి, క్రికెటర్లకు ట్యాగ్ చేస్తూ కీలక సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచ కప్‌పై ఇటీవల బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రధానంగా కెప్టెన్సీ గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచ కప్‌కు రోహిత్ శర్మ సారథిగా ఉంటేనే జట్టు స్ట్రాంగ్ ఉంటుందని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

అంతేకాదు.. ఈ సమావేశంలో కెప్టెన్సీ విషయంపై క్లారిటీ ఇస్తే తాను రెడీ అవుతానని ఓ అధికారితో రోహిత్ చెప్పినట్లు వార్తలు విస్తృతమయ్యాయి. సమావేశం ముగిసే సమయానికి బీసీసీఐ బృందం మొత్తం ప్రపంచ కప్‌లో కెప్టెన్సీ పగ్గాలు రోహిత్‌కు ఇవ్వడే సరైనదని అంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. దీనిపై అతి త్వరలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన రోహిత్ శర్మ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Advertisement

Next Story