- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో రౌండ్‌లో సింధు ఓటమి
దిశ, స్పోర్ట్స్ : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు రెండో రౌండ్‌లోనే నిష్ర్కమించింది. గురువారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో సింధు 21-16, 19-21, 16-21 తేడాతో జపాన్ షట్లర్ టోమోకా మియాజాకి చేతిలో పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో పోరాడి ఓడింది. తొలి గేమ్‌ను నెగ్గి శుభారంభం చేసిన ఆమె చివరి రెండు గేమ్‌లను కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థిని నిలువరించలేకపోయిన సింధు మ్యాచ్‌ను జపాన్ క్రీడాకారిణికి సమర్పించింది.
మరోవైపు, పురుషుల సింగిల్స్‌లో భారత యువ షట్లర్ ప్రియాన్ష్ రజావత్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌లో ప్రియాన్ష్ 21-14, 21-13 తేడాతో చైనా ఆటగాడు లీ లాంక్సీని చిత్తు చేశాడు. మరో షట్లర్ కిరణ్ జార్జ్ 21-18, 21-19 తేడాతో జపాన్‌కు చెందిన టకుమా ఒబయాషిపై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఉమెన్స్ డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో గాయత్రి జోడీ 21-10, 21-12 తేడాతో మరో భారత జంట ప్రియా-శ్రుతిపై గెలుపొందింది. మరో భారత జంట తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప జోడీకి రెండో రౌండ్‌లో నిరాశ తప్పలేదు. జపాన్‌కు చెందిన రుయ్ హిరోకామి-యునా కాటో జోడీ చేతిలో 21-17, 21-16 తేడాతో అశ్విని జోడీ పరాజయం పాలైంది.