Suryakumar Yadav: హార్ట్ బ్రేక్ ఎమోజీ షేర్ చేసిన సూర్యకుమార్ యాదవ్.. లవ్ బ్రేకప్ అయ్యిందా..?

by Prasanna |   ( Updated:2023-12-16 10:01:45.0  )
Suryakumar Yadav: హార్ట్ బ్రేక్ ఎమోజీ షేర్ చేసిన సూర్యకుమార్ యాదవ్.. లవ్ బ్రేకప్ అయ్యిందా..?
X

దిశ,వెబ్ డెస్క్: వరల్డ్ కప్ మ్యాచ్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ మీద ట్రోల్స్ చేసారు. నీ ఆట ఐపీఎల్లో మాత్రమే చూపిస్తావా.. ఇప్పుడు ఒక్క అర్ద సెంచరీ కూడా చేయలేదంటూ నెటిజెన్స్ విమర్శలు చేసారు. ఇదిలా ఉండగా మరోసారి సూర్య కుమార్ యాదవ్ వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఎమోజీ చర్చనీయాంశంగా మారింది. అది కూడా హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశాడు. అంతగా అతడిని బాధించిన అంశం ఏమిటి? లవ్ అఫైర్ కూడా ఏమీ లేదుగా.. మరి ఎందుకు ఇలా పెట్టాడంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

రోహిత్ శర్మను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ముంబయి ఇండియన్స్ నిర్ణయం తీసుకున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ నిర్ణయంపై రోహిత్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు 5 ఐపీఎల్ టైటిల్స్ అందజేసిన కెప్టెన్‌కు మీరు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపైనే సూర్యకుమార్ ఎమోజీ పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని . "హార్ట్ బ్రేక్" ఎమోజీని రూపంలో షేర్ చేసాడు. పైగా ఎలాంటి కామెంట్స్, హ్యాష్ ట్యాగ్‌ లేకుండా తన మనసులోని మాటను ఒక్క ఎమోజీ రూపంలో పంచుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story