- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Suryakumar Yadav : సూర్య కుమార్ ‘ఎక్స్ ఫ్యాక్టర్’ మిస్.. : రైనా

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ సూర్యకుమార్ ‘ఎక్స్ ఫ్యాక్టర్’ను మిస్ కానుందని భారత మాజీ క్రికెటర్ రైనా అభిప్రాయపడ్డాడు. దుబాయ్‌లో గ్రౌండ్ పరిస్థితులు సూర్యకు సరిపోతాయన్నాడు. ‘టీమ్ అనౌన్స్ చేశాక ఆశ్చర్యపోయా. 2022 వరల్డ్ కప్‌లో సూర్య రాణించాడు. అతని అద్భుత ఆటతీరుతో వైట్ బాల్ క్రికెట్‌లో 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరుగాంచాడు. మిడిల్ ఓవర్స్‌లో 9 రన్ రేట్‌తో మొత్తం మ్యాచ్ పరిస్థితులను మార్చగలడు. ప్రత్యర్థిని మిడిల్ ఆర్డర్‌లో డామినేట్ చేయగల ప్లేయర్ మనకు అవసరం. దుబాయ్‌లో గ్రౌండ్ డైమెన్షన్స్ సూర్యకు సెట్ అవుతాయి. సూర్య లేకపోవడం భారత్‌కు పెద్ద లోటు. ప్రస్తుతం టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్లు ఫామ్‌లో లేరు. దీంతో మిడిల్ ఆర్డర్ కీలకం కానుంది. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో ఆడొచ్చు. పంత్ ఉత్తమ ప్రతిభ కనబర్చేందుకు అవకాశం దక్కినట్లయింది. సూర్య ఉంటే ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలడు.’ అని రైనా అన్నాడు.