రోడ్డు ప్రమాదంలో సురేశ్ రైనా తమ్ముడు మృతి

by Mahesh |   ( Updated:2024-05-02 15:50:52.0  )
రోడ్డు ప్రమాదంలో సురేశ్ రైనా తమ్ముడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అతని కజిన్ బ్రదర్ ఈ రోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రైన తమ్ముడు, మరో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. అలాగే హిట్ అండ్ రన్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు హైవే పై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మే 1వ తేదీ రాత్రి సమయంలో.. సౌరభ్ కుమార్, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని గగ్గల్ విమానాశ్రయం సమీపంలో తన స్నేహితుడు శుభమ్‌తో కలిసి స్కూటర్‌పై వెళుతున్నాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వారి స్కూటర్ ను ఢీకొట్టింది. దీంతో 27 ఏళ్ల సౌరభ్, 19 ఏళ్ల శుభమ్ ఇద్దరు తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story