ఐపీఎల్‌లో ధోని రిటైర్మెంట్ అప్పుడే: రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Satheesh |
ఐపీఎల్‌లో ధోని రిటైర్మెంట్ అప్పుడే: రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని రిటైర్మెంట్‌పై తీవ్ర చర్చ నడుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌కు కూడా ధోని ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా ధోని రిటైర్మెంట్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల తను ధోనిని కలిశానని.. రిటైర్మెంట్‌పై ధోనితో తనతో చర్చించాడని తెలిపారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో టైటిల్ గెలవాలని.. గెలిచాక మరో ఏడాది పాటు ఐపీఎల్ ఆడుతానని ధోని చెప్పాడని రైనా వెల్లడించారు.

రైనా కామెంట్స్‌తో ధోని అభిమానులు ఖుష్ అవుతున్నారు. తలాకు ఇదే ఐపీఎల్ లాస్ట్ సీజన్ కాదని.. వచ్చే సీజన్‌లో ధోని మెరుపులు చూడొచ్చంటూ మురిసిపోతున్నారు. ఇక, ఐపీఎల్ 2023లో భాగంగా చెపాక్ స్డేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ వీక్షించేందుకు సురైష్ రైనా స్డేడియానికి వెళ్లాడు. ఈ సందర్భంగా ధోనిని కలసిన రైనా.. తలాతో కొంత సేపు చర్చించాడు. ఇక, ఐపీఎల్‌లో ఏళ్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ ప్రాతినిధ్యం వహించిన రైనాకు ధోనితో ప్రత్యేక అనుబంధం ఉంది. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెంటనే రైనా సైతం క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story