- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఛత్రీ ఈజ్ బ్యాక్

- రిటైర్మెంట్ వెనక్కు తీసుకున్న స్టార్ ప్లేయర్
- టీమ్ ఇండియా ఫుట్‌బాల్ జట్టులోకి మాజీ కెప్టెన్
- ప్రకటించిన ఏఐఎఫ్ఎఫ్
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛత్రి తన రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకన్నాడు. ఈ నెలలో ప్రారంభం కానున్న ఫిఫా ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భారత్ తరపున ఛత్రీ ప్రాతినిథ్యం వహిస్తాడని ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) గురువారం ప్రకటించింది. 'కెప్టెన్, లీడర్, లెజెండ్ త్వరలో భారత జాతీయ జట్టులోకి తిరిగి రానున్నాడు. ఫిఫా ఇంటర్నేషనల్ విండోలో మ్యాచ్‌లు ఆడతాడు' అంటూ ఏఐఎఫ్ఎఫ్ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొంది. ఏఎఫ్‌సీ ఏసియన్ కప్ 2027కు సంబంధించి మూడో రౌండ్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు మార్చి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. బంగ్లాదేశ్‌తో జరుగనున్న మ్యాచ్‌లో సునీల్ ఛత్రి బరిలోకి దిగనున్నట్లు ఫుట్‌బాల్ ఫెడరేషన్ తెలిపింది. షిల్లాంగ్‌లోని జవహర్‌లాల్ నెహ్రు స్టేడియంలో భారత జట్టు రెండు మ్యాచ్‌లు ఆడనుంది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో ఇండియాతో పాటు బంగ్లాదేశ్, హాంకాంగ్, సింగపూర్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. కాగా, గతంలో జరిగిన ఏసియన్ కప్‌లో భారత జట్టు గ్రూప్ స్టేజ్‌లో అన్ని మ్యాచ్‌లు ఓడిపోయి ఇంటి బాట పట్టింది.
ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన భారత క్రీడాకారుడిగా ఛత్రీ గుర్తింపు పొందాడు. గతేడాది కువైట్‌తో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్‌లో భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయకుండా డ్రా చేసుకుంది. ఆ మ్యాచ్ తర్వాత ఛత్రీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్పాడు. కాగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో క్రిస్టియానో రొనాల్డో, లియోనీ మెస్సీ, అలీ దాయి తర్వాత లీడింగ్ గోల్ స్కోరర్‌గా సునిల్ ఛత్రీ ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఇండియన్ సూపర్ లీగ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2007, 2009, 2012లో భారతజట్టు నెహ్రు కప్ గెలుచుకోవడంలో, సాఫ్ చాంపియన్‌షిప్‌ను మూడు సార్లు గెలటవడంలో ఛత్రీ కీలక పాత్ర పోషించాడు. 2005లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం మొదలు పెట్టిన ఛత్రీ.. పాకిస్తాన్‌పై తన తొలి గోల్ సాధించాడు. ఛత్రీ చివరి మ్యాచ్ ఆడే సమయానికి 252 అంతర్జాతీయ గోల్స్ చేశాడు. ఛత్రీ తిరిగి ఇండియా టీమ్‌లోకి రావడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.